Wednesday, August 19, 2026
HomeTelanganaఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నాలుగేళ్లుగా ఉపాధ్యాయుల బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ కాక విద్యాశాఖలో సంక్షోభం నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం బదిలీలు, పదోన్నతులకు ఆటంకాలు తొలగిపోయాయని వారు తెలిపారు. అందుకనుగుణంగా వెంటనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.