Wednesday, August 19, 2026
HomeTelanganaఆర్టీఏ ఆర్టీసి అధికారులు సంయుక్తంగా వాహనాల తనీఖీ

ఆర్టీఏ ఆర్టీసి అధికారులు సంయుక్తంగా వాహనాల తనీఖీ

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా: జగిత్యాల నుండి ధర్మపురి వెళ్ళే రోడ్డులో ఆర్టీఏ, ఆర్టీసీ అధికారులు శనివారం సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. దాదాపు 43 వాహనాలు సరియైన పత్రాలు లేనందున తమ అధీనంలోకి తీసుకొని జగిత్యాల బస్ డిపోకి తరలించడం జరిగిందని, వీరికి దాదాపు 3 నుండి 5 లక్షల రూపాయల వరకు అపరాధ రుసుము విధించవచ్చని జగిత్యాల మోటార్ వాహన తనిఖీ అధికారి జి. వంశీదర్ తెలిపారు.

నేటి నుండి ప్రతి రోజు వాహనాల తనిఖీ జరుగుతుందని కావున వాహన యజమానులు అన్ని రకాల వాహన పత్రాలు సరి చేసుకొని తిరగాలని లేని యెడల వారి వాహనాలను తమ అధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలకు సంబందించి జగిత్యాల జిల్లాలో 7000 పైగా వాహనాలు టాక్స్ కట్టడం లేదని కావున అటువంటి వాహనాలు రోడ్డు పై తిరిగితే కటిన చర్యలు తీసుకుంటామని, వాహన యజమానులు గమనించి తమ వాహనాల పత్రాలు అన్ని సరి చేసుకొని తమ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

ఈ వాహన తనిఖీలలో వాహన తనిఖీ అధికారులు జీ. వంశీధర్, వి. వెంకట రమణ, కానిస్టేబుల్స్ బాలు, సునిల్, అశోక్, రాము, సైదులు, ఆర్టీసీ. డీ. యం, డీ. వి. యం జగిత్యాల ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.