Wednesday, August 19, 2026
HomeTelanganaట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తే జరిమానా: ఎస్పీ

ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తే జరిమానా: ఎస్పీ

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా: ట్రాఫిక్ నియమ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వాహనదారులకు విదిస్తున్న ట్రాఫిక్ ఈ-చాలన్స్ ఇక నుండి సిసి కెమెరాల ద్వారా కూడా గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ తెలిపారు.

శనివారం ఎస్పీ సింధుశర్మ కమాండ్ కంట్రోల్ రూమ్ ను అదనపు ఎస్పీ రూపేష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటిని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేయడం జరిగిందన్నారు.

ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ నియమాలను అతిక్రమించిన వారిని గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ మొబైల్ ఏక్సిబిషన్ వ్యాన్ ద్వారా ప్రజలకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి రోజు ఒక గ్రామంలో అవగాహన కలిపిస్తున్నామని ఎస్పీ తెలిపారు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీటు బెల్టు ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ- చాలన్స్ ను సకాలంలో చెల్లించాలని కోరారు. మూడు కంటే ఎక్కువగా ట్రాఫిక్ ఈ-చాలన్స్ పెండింగ్ లో ఉన్న వాహనాలు జిల్లా వ్యాప్తంగా గుర్తించి, ఈ చాలాన్స్ ను చెల్లించ లేనిపక్షంలో సదరు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ సింధుశర్మ తెలిపారు. ఈ కార్య క్రమంలో టౌన్ ఇన్స్పెక్టర్ కోరే కిషోర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, ట్రాఫిక్ ఎస్సై లోకిని రాము, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.