Wednesday, August 19, 2026
HomePoliticalరేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ..!

రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ..!

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం రేపు మధ్యాహ్నం సమావేశం కానుంది. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ జరగనుంది. ధాన్యం కొనుగోలుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాని నేపథ్యంలో తెరాస ఇవాళ ఢిల్లీలో దీక్ష చేపట్టింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన వచ్చినా.. రాకపోయినా ఆయా విషయాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని ఇవాళ హైదరాబాద్ బయల్దేరనున్నారు. పది రోజుల పాటు కేసీఆర్ దిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.