Monday, August 17, 2026
HomeTelanganaసీఎం కేసీఆర్ పంటికి సర్జరీ..?

సీఎం కేసీఆర్ పంటికి సర్జరీ..?

📰 Generate e-Paper Clip

తెలంగాణ: తెలంగాణ సీఎం కేసీఆర్ పంటికి సోమవారం సర్జరీ జరిగింది. సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా తీవ్ర పంటినొప్పితో భాదపడుతున్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ కు సోమవారం మధ్యాహ్నం ఓ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ కు శస్త్రచికిత్స చేసి ఓ పంటిని తొలగించినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. సర్జరీ నిమిత్తం అనస్తీషియా సైతం ఇవ్వడంతో సీఎం కేసీఆర్ రోజంతా విశ్రాంతిలోనే గడిపారు. మరో రెండు రోజులపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్ కు వైద్యులు సూచించినట్లుగా చెబుతున్నారు. తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి పలువురు ఎంపీలు మధ్యాహ్నం వెళ్లినప్పటికీ ఆయన విశ్రాంతిలో ఉండటంతో కలవలేక కేవలం భోజనం చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.