Thursday, August 20, 2026
HomeTelanganaకాళోజీ వర్సిటీ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్..

కాళోజీ వర్సిటీ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్..

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ పీజీ కటాఫ్ స్కోర్ తగ్గినందున దరఖాస్తులకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను వెల్లడించనున్నారు. పూర్తి వివరాలను www.knruhs, telangana. gov.in వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు వర్సిటీ పేర్కొంది. గతంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన వర్సిటీ.. అన్ని కళాశాలలకు ఒకేసారి వెన్ఆప్షన్లు నమోదు చేసేలా అవకాశం కల్పించింది. అన్ని కౌన్సెలింగ్లకు వెబ్ ఆప్షన్ల ఆధారంగానే సీట్ల కేటాయింపులు ఉంటాయని.. అందువల్ల ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ సూచించింది..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.