జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో 319 వరి ధాన్యం కొనుగోలు ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 166 కోట్ల 24 లక్షల రూపాయల నగదు సంబంధిత రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రతిపాదించిన 326 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 319 కొనుగోలు ,కేంద్రాల ద్వారా 1 లక్షా 18 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో 41 వేల 132 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉందని, సంబంధిత 12 వేల 127 మంది రైతుల ఖాతాలలో 166 కోట్ల 24 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 29 రైస్ మిల్లులకు సి.ఎం.ఆర్. అనుమతులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 314 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి చేసి మూసి వేయడం జరిగిందని, జిల్లాల కొనుగోలు ప్రక్రియ దాదాపు 99 శాతం పూర్తయిందని, రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అందించిన సన్న రకం ధాన్యం బోనస్ తో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.