Monday, August 17, 2026
HomeTelanganaమట్టి వినాయకున్ని పూజిద్దాం..! పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం.

మట్టి వినాయకున్ని పూజిద్దాం..! పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం.

📰 Generate e-Paper Clip

మట్టి వినాయకున్ని పూజిద్దాం..! పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం.

ఆంజనేయులు న్యూస్,కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా,కాగజ్ నగర్ : మట్టి వినాయకున్ని పూజిద్దాం పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం అని పట్టణ ఎస్ హెచ్ ఓ ప్రేమ్ కుమార్ అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కాగజ్ నగర్ పట్టణ భవన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రోజున పద్మశాలి భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ హెచ్ ఓ ప్రేమ్ కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి పద్మశాలి కుల బాంధవులకు పంపింణి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో పద్మశాలీలు ముదుంటున్నారని మీ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.పద్మశాలి కుల భాంధవులు అందరు కలిసి కట్టుగా అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా భవన కమిటీ సభ్యులు సిందం చంద్రయ్య మాట్లాడుతూ మాజీ అధ్యక్షులు రాపెల్లి సదానందం సాయి ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనియం అని అన్నారు.ఈ ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పద్మశాలి కమిటీ ఆధ్వర్యంలో 2012 నుండి ఇప్పటి వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు.మాజీ అధ్యక్షులు సదానందం మాట్లాడుతూ పద్మశాలంతా ఐక్యతగా ఉండి అన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకుందాం అన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గుల్లపెళ్లి ఆనంద్,నల్ల కనకయ్య,కొంగ సత్యనారాయణ, దోమల సురవర్ధన్,అవధూత శ్రీనివాస్, గుల్లపెళ్లి నాగేశ్వరరావు, వాడ్నాల వెంకన్న,గడదాసు మల్లయ్య,నూతి సుదర్శన్,దుబ్బ శంకర్, మామిడాల తిరుపతయ్య, మామిడాల రామకృష్ణ, కొంపెల్లి సుదర్శన్,సుంక సంతోష్,బింగి వేణు,మామిడాల మమత, సిందం శ్రీనివాస్, చెన్నూరి సునీత,చెన్నూరి స్రవంతి,సిరిమల్లె మంజుల,అల్లి గురువయ్య,బోగ వెంకటేశం, పద్మశాలి మహిళలు, యువకులు, కుల భాంధవులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.