Monday, August 17, 2026
HomeCrimeపశువులను అక్రమంగా తరలిస్తున్న నలుగురి పై కేసు నమోదు

పశువులను అక్రమంగా తరలిస్తున్న నలుగురి పై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

పశువులను అక్రమంగా తరలిస్తున్న నలుగురి పై కేసు నమోదు: జిల్లా ఎస్పీ.

ఆంజనేయులు న్యూస్ ,కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,దహేగామ్  ; జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరిచారు.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం, లగ్గావన్ ఎక్స్ రోడ్డు,  వద్ద శనివారం రోజున జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీ చేపట్టగా, తనిఖీ సమయంలో బొలెరో వాహనం నంబర్ TS 18 T 1439 లో 6 పశువులను అక్రమంగా రవాణా చేస్తూన్న నలుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్,  తెలిపారు.పట్టుబడినవారిలో ఇలియాస్ నవాబ్ ఖురేషి, బిలులీ, మహారాష్ట్ర,మొహమ్మద్ రహ్మత్, ఇందల్వాయి, నిజామాబాద్,షకీల్ ఖురేషి, కొండల్వాయి, మహారాష్ట్ర,ఫరీద్, బిలులీ, మహారాష్ట్ర, పట్టుబడిన నిందితులను, వాహనాన్ని దహెగాం పోలీస్ స్టేషన్‌కి అప్పగించగా, అక్కడ కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, మాట్లాడుతూ జిల్లా పరిధిలో అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా పశువుల అక్రమ రవాణా, స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్ మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,ఎవరూ చట్టాన్ని అతిక్రమించేందుకు ప్రయత్నిస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.ఈ దాడిలో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ , ఎస్‌ఐ రాజు, హెడ్ కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుల్స్ విజయ్, మధు, రమేష్, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ సాయి, తమ్షీర్ ఖాన్, రాజశేఖర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.