Telugu Updates
Logo
Natyam ad

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి రథానికి బంగారు కవచాల వితరణ..

యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి స్వర్ణ రథం సిద్ధమైంది. హైదరాబాద్ కు చెందిన లోగిళ్లు ల్యాండ్ మార్క్ డెవలపర్స్ సంస్థల ఆధ్వర్యంలో చెన్నైలో రూపొందించిన స్వర్ణ కవచాలను టేకు రథానికి అమర్చారు. పసిడి శోభ సంతరించుకున్న రథానికి.. దాతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి బాలాలయంలో పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఈవో గీత, ప్రధాన పూజారి లక్ష్మీ నరసింహచార్యులకు అప్పగించారు. సుమారు రూ.75 లక్షల విలువైన బంగారంతో కవచాలు తయారు చేయించామని దాతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి బాలాలయంలో చేపట్టనున్న రథోత్సవంలో.. పుత్తడి రథంపై యాదాద్రీశుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు..