Telugu Updates
Logo
Natyam ad

ప్రపంచ చెస్ ఛాంపియన్ కు 16 ఏళ్ల బుడతడు షాక్.!

ఆంజనేయులు న్యూస్: ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్లెసెన్ కు 16 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద షాక్ ఇచ్చాడు. చెస్సబుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ లో శుక్రవారం కార్లెసెన్ను ఓడించాడు. మూడు నెలల వ్యవధిలో రెండు సార్లు కార్ల్సెన్పై ప్రజ్ఞానంద గెలవడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న చెస్సబుల్ మాస్టర్స్ టోర్నీ 5వ రౌండ్లో కార్ల్సన్పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. ఈ చెస్ టోర్నీలో 16 మంది ఆటగాళ్లు పాల్గొంటారు. వాస్తవానికి కార్ల్సన్-ప్రజ్ఞానంద మధ్య మ్యాచ్ డ్రా అవుతుందని అంతా భావించారు. ఇద్దరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంతో డ్రా జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ తరునంలో తన 40వ ఎత్తులో కార్ల్సన్ ఓ తప్పు చేశాడు. దానిని ప్రజ్ఞానంద అందిపుచ్చుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా గేమ్ ను తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు..

ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కార్లెసెన్ తో ఎయిర్ఆంగ్స్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ టోర్నీలో ప్రజ్ఞానంద తలపడ్డాడు. అందులోనూ ప్రపంచం. ఛాంపియన్ కార్ల్సన్పై ప్రజ్ఞానంద్ విజయం సాధించాడు. ప్రస్తుతతం జరుగుతున్న చెస్సబుల్ మాస్టర్స్ టోర్నీలో కార్ల్సెన్ 15 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద 12 పాయింట్లు సాధించి, 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఆశ్చర్యకరంగా చైనాకు చెందిన గ్రాండ్ మాస్టర్ వియి వైయి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.