Telugu Updates
Logo
Natyam ad

ఒకే గదిలో ముగ్గురు మహిళలతో పాడు పని.?

ఢిల్లీ: దేశ రాజధానిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. పక్కా సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడులు చేశారు. అనంతరం నలుగురు మహిళలను, ఓ విటుడిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి నేషనల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం. దేశ రాజధాని ఢిల్లీలోని దిల్ షాద్ కాలనీలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసేందుకు ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు. అందులో ఓ కానిస్టేబుల్ ను డెకాయిగా ఆ ఇంటిలోకి పంపించారు. డెకాయిగా వెళ్లిన కానిస్టేబుల్ ను ఓ మహిళ ఆ ఇంటిలోని అండర్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లి మాట్లాడింది. తన వద్ద మొత్తం ముగ్గురు మహిళలు ఉన్నారని, ఒక్కొక్కరికీ రూ 1500 చొప్పున తీసుకుంటున్నట్లు చెప్పింది. అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఆ కానిస్టేబుల్ తమ టీమ్ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. అనంతరం ఓ విటుడితోపాటు నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు..