Telugu Updates
Logo
Natyam ad

వుమెన్ అచీవర్స్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వంచే వుమెన్ అచీవర్స్- 2024 అవార్డు అందుకున్న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎసిసి- 3 అంగన్ వాడీ టీచర్ ఎన్. పద్మను శుక్రవారం యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్లి అంజయ్య యాదవ్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్ కేంద్రం ద్వారా ఉత్తమ సేవలు అందిస్తున్న టీచర్ పద్మకు ప్రభుత్వ పురస్కారం రావడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి పట్టణ అధ్యక్షుడు పర్శ రాజన్న యాదవ్, నాయకులు బూస మహేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.