Telugu Updates
Logo
Natyam ad

సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి

మంచిర్యాల జిల్లా: నేరాలను నియంత్రణకు పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ నేరస్థులకు శిక్ష పడేలా చూడాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. మంగళవారం మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో తప్పనిసరిగా 5S విధానం అమలు చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి ప్రమాదానికి గల కారణాలను పరిశీలించి, ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేసి చట్టపరిధిలో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా చూడాలన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలు నిర్వర్తించి, రామగుండం కమిషనరేట్, తెలంగాణ పోలీస్ కు మంచిపేరు తీసుకురావాలన్నారు..