Telugu Updates
Logo
Natyam ad

అఖిలేశ్ యాదవ్ తో భేటీ కానున్న సీఎం కేసీఆర్..

దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్తో ఆయన భేటీ కానున్నారు. దిల్లీలోని కేసీఆర్ నివాసంలో ఈ భేటీ జరగనుంది. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం ఢిల్లీ నుంచి కేసీఆర్ చండీగఢ్కు వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 మంది రైతుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. దాదాపు నాలుగు రోజుల పాటు కేసీఆర్ పంజాబ్లోనే ఉంటారు.