Telugu Updates
Logo
Natyam ad

తుపాకితో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య..?

హైదరాబాద్: చిక్కడపల్లిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బాగ్ లింగంపల్లికి చెందిన న్యాయవాది శివారెడ్డి గతంలో వాయుసేనలో పనిచేసి పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన శివారెడ్డి తన భార్య నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఈరోజు ఉదయం 6గంటలకు కడప నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకుని తిరిగి బయటకు రాలేదు. బంధువులు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.

అనుమానం వచ్చిన బంధువులు శివారెడ్డి ఇంటికి చేరుకుని తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నారు. తన లైసెన్స్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.