Telugu Updates
Logo
Natyam ad

గోడ కూలీ మృతి చెందిన కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

ఒక్కక్క కార్మిక కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలి.

సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గోడ కూలీ మృతి చెందిన కార్మిక కుటుంబాలను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి వద్ద పరామర్శించడం జరిగింది. తోటి కార్మికులతో జరిన ప్రమాదం గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాకు సమీపంలో ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగ గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి, చెందగా, మరొకరికి తీవ్రగాయాలాయ్యాయి.ఇంటి యజమాని సదరు కాంట్రాక్టర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే  ప్రమాదం జరిగింది. మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. కార్మికుల పని స్థలాలు, ప్రాంతాల వద్ద అన్ని జాగ్రత్తలు పాటించే విధంగా కార్మిక శాఖ అధికారులు  చర్యలు తీసుకోవాలి. జరిగిన ఘటన పైన పోలీసులు  విచారణ చేసి బాధ్యులపై చట్టరిత్య చర్యలు తీసుకోవలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.లక్ష్మణ్ సిఐటియు నాయకులు, అరిగేల మహేష్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.