విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించేందుకే క్రికెట్ టోర్నీలు..* *సమ్మర్ క్రికెట్ క్యాంపు టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఐ,ప్రిన్సిపాల్ వెల్లడి.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల రూరల్:విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభ,నైపుణ్యాలను వెలికితీయడమే టోర్నీలు ఉపయోగపడుతాయని పట్టణ సీఐ నవీన్ కుమార్.సోమవారం కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల మరియు కళాశాల వారి సౌజన్యంతో కళాశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు క్రికెట్ టోర్నమెట్ ను అట్టహాసంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి షాద్ నగర్ పట్టణ సీఐ నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ముందుగా విద్యార్థులను పరిచయం చేసుకుని టోర్నిని ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… ఇలాంటి టోర్నమెంటుల ద్వారా విద్యార్థులలో,క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ,నైపుణ్యాలను వెలికితీయడానికి టోర్నీలు చాలా ఉపయోగకరంగ ఉంటుందని అన్నారు.జిల్లా వ్యాప్తంగా యువతను క్రీడల్లో ముందుకు తీసుకెళ్లేందకు ఇలాంటి ప్రీమియర్ లీగ్ దోహద పడుతుందన్నారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ…సమ్మర్ క్యాంపు టోర్నీ ఏప్రిల్ 25 నుండి మే 8వరకు నిర్వహిస్తున్నామని,వివిధ జిల్లాల నుండి కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు.సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి రోనాల్డ్ క్యాంపు ను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సాహించడం సంతోషం ఉందని కొనియాడారు.పదిహేను రోజుల పాటు క్యాంపు నిర్వహించడం జరుగుతుందని,క్యాంపు లో పాల్గొంటున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులు,కళాశాల యాజమాన్యం, తదితరులు హాజరయ్యారు…