Telugu Updates
Logo
Natyam ad

వడ్ల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి

వడ్ల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు.

ఆంజనేయులు న్యూస్, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు గురువారం చెన్నూర్ నియోజకవర్గం లోని దుబ్బపల్లి, పొన్నారం, దుగ్నేపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తూ దుగ్నేపల్లి దగ్గర కాంటలోపం వల్ల ప్రతి బస్తాకు కేజీ నుండి కేజీన్నర తూకం వేసి రైతులను మోసం చేయడం పోన్నారం దగ్గర రైతుల వడ్లుకొని రసీదు ఇచ్చే సమయంలో వడ్లకు సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు జత చేసి ఈ యొక్క రైతుల వడ్లని వారికి కొంత భాగం కేటాయిస్తూ మోసం చేయడం అలాగే దుబ్బపల్లి లో ప్రతి లారీకి 8 క్వింటాళ్ల వడ్లను తక్కువ వచ్చినవి అనే సాకుతో అక్కడున్నటువంటి రైతులను మోసం చేయడం ఈ మూడు వడ్ల కొనుగోలు సెంటర్లో జరుగుతున్నటువంటి అవినీతి ఆధారాలను చూపిస్తూ ఇట్టి చర్యలకు పాల్పడిన కాంగ్రెస్ నాయకుల పై అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, చెన్నూరు నియోజకవర్గం లోని ప్రతి ఒక్క వడ్ల కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జేసీ కి వినతి పత్రం అందజేసిన చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు, ఎంపీపీ మంత్రి బాపు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మాజీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు సమ్మి రెడ్డి, సోమన పల్లి ఎంపీటీసీ తుమ్మల తిరుపతి రెడ్డి, గోగుల రవీందర్ రెడ్డి, కిరణ్, అర్జున్ రెడ్డి, రవీందర్ గౌడ్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.