ఆదిలాబాద్ జిల్లా: కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆసుపత్రి ఆర్ఎంఓ తొడసం చందు తెలిపిన వివరాల మేరకు గత నెల 29 అంబులెన్స్ లో అతనిని తరలించి రిమ్స్ లో చేర్పించారు. వడ దెబ్బ లక్షణాలున్న ఆ వ్యక్తి ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. మృతునికి చెందిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేదన్నారు. శవాన్ని రిమ్స్ మార్చరీలో భద్రపర్చినట్లు తెలిపారు. ఎవరైనా సంబంధీకులు ఉంటే రిమ్స్ లో లేదా ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసు స్టేషన్లో వారం రోజుల్లో సంప్రదించాలని సూచించారు. లేకుంటే మృతదేహాన్ని అంత్యక్రియల కోసం పురపాలక సంఘానికి అప్పగిస్తామన్నారు.