Telugu Updates
Logo
Natyam ad

దుస్తులు విప్పేసి ఆర్టీసీ డ్రైవర్ నిరసన..!

నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ ఆర్టీసీ డిపో-2లో పనిచేస్తున్న డ్రైవర్ గణేశ్.. శనివారం డీఎం కార్యాలయం వద్ద తన దుస్తులు విప్పేసి నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఆయన 15 ఏళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల కేఎంపీఎల్ (మైలేజి) తక్కువ వచ్చిందని ఆయనకు డీఎం కౌన్సెలింగ్ నిర్వహించారు. వారం గడవక ముందే మళ్లీ డీఐ పిలిచి.. కేఎంపీఎల్ తగ్గిందంటూ డీఎంను కలవాలని చెప్పారు. దీంతో గణేశ్ ఆవేదనకు గురై.. తరచూ ఇలా కౌన్సెలింగ్ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. పాత బస్సులతో కేఎంపీఎల్ ఎలా తీసుకురావాలని ప్రశ్నిస్తూ తన దుస్తులు విప్పేసి బయటికొచ్చేశారు. తోటి సిబ్బంది ఆయనను అడ్డుకుని సముదాయించారు.

దీనిపై డీఎం వెంకటేశంను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. కౌన్సెలింగ్ కు హాజరు కావాలనే బాధతోనే గణేశ్ ఇలా చేశారన్నారు. సంస్థను కాపాడేందుకు అందరం కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు..