తితిదే ధర్మరథం బస్సులో మంటలు..!
ఘాట్ రోడ్ లో తప్పిన ప్రమాదం:
తిరుమల: తిరుమల ఎగువ కనుమదారిలో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న తితిదే ధర్మరథం బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును లింక్ రోడ్డు వద్ద నిలిపివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.