తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
మంచిర్యాల జిల్లా: తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో మంచిర్యాల జిల్లాలోని వెల్గనూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు అత్యద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ నెల 3, 4 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ పోటీల్లో మొక్క జొన్న కంకులను సులభంగా కాల్చే మైజ్ ఆన్ హీట్ అనే పరికరం 4వ స్థానం సాధించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ. 1.50 లక్షలు నగదు బహుమతి ప్రధానం చేశారు. ఈ పరికరాన్ని రూపొందించిన విద్యార్థులు అభిలాష్, లక్ష్మణ్, వినయ్ వర్మ, టి. అభిలాష్, గైడ్ టీచర్ వేణుగోపాల్ ను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటిన విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జిల్లా సైన్స్ అధికారిని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు అభినందించారు..