Telugu Updates
Logo
Natyam ad

భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ..

హైదరాబాద్: శాసనసభ నుంచి భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సస్పెన్షన్ ప్రొసీడింగ్స్, వీడియో రికార్డింగ్లను తమకు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలన్న భాజపా ఎమ్మెల్యేల అభ్యర్థనను కూడా ఉన్నత న్యాయస్థానం. తోసిపుచ్చింది. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న వాదనలు జరిగాయి. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేయలేక పోయినట్లు భాజపా ఎమ్మెల్యేలు హైకోర్టు రిజిస్ట్రీకి తెలిపారు.

సస్పెన్షన్ తీరు రాజ్యాంగానికి, శాసనసభ నియమావళికి గా ఉందని భాజపా ఎమ్మెల్యేలు వాదించారు. కనీసం సస్పెన్షన్ ఉత్తర్వులు, వీడియో రికార్డింగ్ లు కూడా ఇవ్వడం లేదన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులు ఎత్తివేసి సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు, ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశిస్తూ మరోసారి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.