తెలంగాణ: తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ఇటీవల మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు చేపించుకున్న పేషెంట్లను పరామర్శించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి మోకాలి చిప్పలు మార్పిడినీ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట ఆసుపత్రిలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్ చేస్తామని.. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు. రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్లను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీగా చేసేందుకు త్వరలోనే ఏర్పాట్లు చేస్తామని మంత్రి ప్రకటించారు..