ఆదివాసీ సంప్రదాయ చీర కట్టుతో సీతక్క, ఎమ్మెల్యే కోవలక్ష్మీ
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కేరమెరి మండలం లోని జంగు బాయి జాతరకు హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదివాసీ గిరిజన సంప్రదాయ చీర కట్టుతో ఆకట్టుకున్నారు. ఎప్పుడూ చీరకట్టు లో కనిపించే సీతక్క సోమవారం జంగూ బాయి ఆలయం వద్ద ఆకుపచ్చ చీర కట్టుకుని సంప్రదాయాన్ని మరోసారి చాటారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కుడా మంత్రి తో అదే విధంగా చీర కట్టుకుని సంప్రదాయం గుర్తు చేశారు.