Telugu Updates
Logo
Natyam ad

రంజాన్ వేళ విషాదం.. ఇద్దరు బాలురు మృతి!

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో రంజాన్ వేళ విషాదం నెలకొంది. శ్మశాన వాటికలో విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృతిచెందారు. వీరిద్దరూ మూడ్రోజుల కిందట అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలురు ఆచూకీ కోసం గాలిస్తుండగానే ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. మృతిచెందిన పిల్లలను అబ్దుల్ అజీజ్ (11), ముల్తాని బాబు (16) గా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన పిల్లలు తొలుత ఎక్కడికి వెళ్లారు? శ్మశాన వాటికకు ఎందుకొచ్చారు? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.