Telugu Updates
Logo
Natyam ad

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీపీ. ఎస్ చంద్రశేఖర్ రెడ్డి..

ట్రాఫిక్ నియమాలను  పటిష్టంగా అమలు పరచాలి..

పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జోన్ రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్, (ఐజీ) అడిషనల్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ ఐపిఎస్, ఏసీపీ ట్రాఫిక్ బాలరాజ్, ఏసీపీ గిరి ప్రసాద్ లతో కలిసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్ లో ఉన్న వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ నియమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు ట్రాఫిక్ అధికారులకు, సిబ్బంది పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను వాహనదారులు అందరూ పాటించేటట్లు చర్యలు చేపట్టాలని,  ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారు ఎంతటి వారు అయిన ఉపక్షించవద్దు అని అన్నారు. పోలీస్ సిబ్బంది కూడా ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు..

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాల పై ఉన్న పెండింగ్ చలాన్స్ ను పేదలు, మధ్య తరగతి ప్రజలు గత రెండు సంత్సరాలుగా కోవిడ్ వలన పడిన ఆర్థిక ఇబ్బందులని పరిగణలోకి తీసుకొని పెండింగ్ చాలాన్స్ లో రాయితీ ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని పెండింగ్లో ఉన్న చాలన్స్ క్లియర్ చేసుకోవాలని తెలపడం జరిగింది. పెండింగ్ చాలాన్స్ చెల్లించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్న గ్రామాలలో పెండింగ్ చలాన్స్ ఉన్న వాహనాలను గుర్తించి వారు మీ సేవ, ఇతర ఆన్లైన్ మార్గాలలో చెలించేందుకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, ట్రాఫిక్ ఎస్ఐ లు కమలాకర్ ,నాగరాజ్, మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు..