Telugu Updates
Logo
Natyam ad

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ..!

మంచిర్యాల జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ ఐబీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు జరిగింది. ఈ ర్యాలీలో కమిషనరేట్ డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్, ఎసిపి సాధన రష్మీ, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నారాయణ నాయక్, ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్, పలువురు సిఐలు, మరియు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..