మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్
మంచిర్యాల జిల్లా: సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ కారు డోర్లకు బ్లాక్ ఫిలిం వేసుకొని తిరుగుతున్న 40 కార్లపై కేసు నమోదు చేసి ఈ-చలాన్ ద్వారా జరిమానా విధించినట్లు మంచిర్యాల ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ తెలిపారు. కార్ల బ్లాక్ ఫిలిం తొలగింపు పై వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. వాహనదారులు తమ కార్లకు ఉన్న బ్లాక్ ఫిలిం తొలగించుకోవాలని సూచించారు..