Telugu Updates
Logo
Natyam ad

మంత్రి కాన్వాయ్ కు ప్రమాదం.. గన్మేన్లకు గాయాలు..

మహబూబాబాద్: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చోటుచేసుకుంది. మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో కార్గిల్ సెంటర్ సమీపంలోకి రాగానే కాన్వాయ్ కు జంతువు అడ్డు రావటంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. ఆ వెనుకనే వస్తున్న కాన్వాయ్ లోని మరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గన్మెన్లకు స్వల్ప గాయాలు కాగా.. మంత్రి సత్యవతి సురక్షితంగా మహబూబాబాద్ కు చేరుకున్నారు. స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు..