Telugu Updates
Logo
Natyam ad

గ్రంథాలయంకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేయూత

మంచిర్యాల జిల్లా: కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంకు శనివారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 100 కుర్చీలు, రూ. 10 వేలు విలువ చేసే స్టడీ మెటీరియల్ ను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రంథాలయాలలో కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సుధాకర్, సభ్యులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..