Telugu Updates
Logo
Natyam ad

రైతు సంఘర్షణ సభకు భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

మంచిర్యాల జిల్లా: వరంగల్ లో జరగబోయే రైతు సంఘర్షణ సభకు మంచిర్యాల నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసం నుండి 152 ప్రత్యేక వాహనాల ద్వారా పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాల్గొనే సభకు జిల్లా నుండి పెద్దసంఖ్యలో తరలివెళ్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే పోరాటాలకు ఈ సభ వేదిక కానున్నట్లు వారు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో రైతులతో పాటు అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని వారు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలను గద్దె దింపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు..