ఫరార్ అయిన ఖైదీ ..! ఆచూకి లభ్యం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కేంద్రంలోని సబ్ జైల్ నుండి కుమ్రం రాజేష్ (38) అనే ఖైదీ తప్పుంచుకుని పారిపోవడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రౌటసంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మెంగుబాయి గూడ గ్రామానికి చెందిన రాజేష్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు. ఈ రోజు ఉదయం సుమారు 6.30 నిమిషాలకు జైలు ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగిస్తున్న క్రమంలో అదను చూసుకుని ఇతను పారిపోయాడు.. ఉదయం నుండి అతని కోసం గాలిస్తున్న పోలీసులకు అతని ఆచూకీ దొరికింది. అతన్ని తిరిగి జైలుకు తరలిస్తున్నట్లు జైల్ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు..