Telugu Updates
Logo
Natyam ad

దారికి అడ్డంగా ఉందని ఇంటిని కూల్చివేశారు..!

మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట గ్రామపంచాయతీ పరిధి మిట్టపల్లి గ్రామంలో దారికి అడ్డంగా ఉందని అన్యాయంగా తమ ఇంటిని కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు రామిళ్ల ఆశయ్య కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన మంచిర్యాల కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుల్లకోట గ్రామ పంచాయతీ రికార్డులో 2007 నుండి 2018 వరకు ఇంటి నంబర్ ఉండగా, మిట్టపల్లి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత రికార్డులో చేర్చమని గ్రామపంచాయతీ కార్యదర్శికి చెప్పిన చేర్చలేదన్నారు. సోమవారం గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓ తన తండ్రి ఇంటిని కూల్చివేశారని ఆవేదన. వ్యక్తం చేశారు. దీనికి బాద్యు లైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు..