Telugu Updates
Logo
Natyam ad

పల్టీలు కొట్టిన కారు ఇద్దరికి గాయాలు..!

ఆదిలాబాద్ జిల్లా బోథ్: నేరడిగొండ మండల కేంద్రంలో సోమవారం ఉదయం కారు బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మహారాష్ట్రలోని నాగపూర్ నుండి హైదరాబాదుకు వెళ్తున్న కారు మండలంలోని రోల్ మామ టోల్ ప్లాజా వద్దకు రాగానే పట్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో సూరజ్, రవి అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 ఆంబులెన్స్ వాహనంలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాదానికి నిద్రమత్తు కారణమనే తెలుస్తోంది..