దిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల మోత మోగింది. నిన్న రాత్రి ముగ్గురు దుండగులు అందరూ చూస్తుండగానే ఇద్దరిపై కాల్పులు జరపడం కలకలం రేపింది. ఢిల్లీ సుభాష్ నగర్ అన్నాదమ్ములిద్దరూ కారులో వెళ్తుండగా ఘటన జరిగింది. కాల్పుల నుంచి సోదరులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా దుండగులు వెంబడించి మరీ తుపాకులతో కాల్చారు. మొత్తం పది రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సోదరులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
కాల్పుల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. పోలీసులు వాటి ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో ఉన్నారు. పాతకక్షలే కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.