హైదరాబాద్: కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కావడం లేదనే మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య కి పాల్పడింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్ లో విజయ లక్ష్మి(26) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. తనకు పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా వివాహం మాత్రం కావడం లేదని విజయలక్ష్మి బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయ లక్ష్మి గురువారం మృతి చెందింది..