జమ్మూకాశ్మీర్: లో కరుడుగట్టిన ఉగ్రవాదులను ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లష్కరే తోయిబా సంస్థకు చెందిన తాలిబ్ హుస్సేన్, ఫైజల్ అహ్మద్ లను రియాసీ జిల్లా తుక్సన్ గ్రామస్తులు ఆదివారం నిర్బంధించారు. పోలీసులు అక్కడకు చేరుకుని భారీగా తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రూ.5 లక్షలు, డీజీపీ దిల్బాగ్ సింగ్ రూ.2 లక్షల నజరానా ప్రకటించారు..