తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్.?
తెలంగాణ: తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్-2022 ఆదివారం జరుగనుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశానికి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం 73,201 మంది దరఖాస్తు చేసుకున్నారరు. వీరంతా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉన్నది. వివరాలకు www.telanganams.cgg.gov.in చూడవచ్చు.