Telugu Updates
Logo
Natyam ad

ప్రతి రిజిస్ట్రేషన్ కు హరిత నిధి రుసుం.?

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి రిజిస్ట్రేషన్ కు రూ.50 చొప్పున తెలంగాణ హరిత నిధిని వసూలు చేయనున్నారు. ప్రతి రిజిస్ట్రేషన్ సందర్భంగా ఈ మొత్తాన్ని ఈ స్టాంపుల రూపంలో వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది మార్చి 1 తేదీ నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో హరితనిధి మొత్తాన్ని వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీని ఆదేశించారు..