Telugu Updates
Logo
Natyam ad

టీహబ్ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్..!

హైదరాబాద్: భాగ్యనగరంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకేసారి నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేందుకు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్ ఫెసిలిటీ సెంటర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీహబ్ ప్రత్యేకతలను అధికారులు సీఎంకు వివరించారు. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మించింది. 53.65 మీటర్ల ఎత్తులో (రెండు బేస్మెంట్లు, 10 అంతస్తులు.. మూడు ఎకరాల్లో 3.6 లక్షల చదరపు అడుగుల్లో) నిర్మించారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశంజన్, సైయింట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, టీహబ్ సీఈవో శ్రీనివాస్ రావు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. టీహబ్ ప్రాంగణం మొత్తం ఐటీ దిగ్గజాలు, అంకుర సంస్థలతో సందడిగా మారింది..