Telugu Updates
Logo
Natyam ad

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు మృతి.?

మంచిర్యాల జిల్లా: ఇష్టపడిన అమ్మాయి ప్రేమను తిరస్కరించడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ర్యాలీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోండ్ర రాజశేఖర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తుండగా, ఆమె తిరస్కరించడంతో మనస్తాపం చెంది ఈ నెల 4న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుండి వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.