Telugu Updates
Logo
Natyam ad

విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్

ప్రశంసా పత్రాలను అందజేస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఆదిలాబాద్ జిల్లా: విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక, కళా రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ఆమె ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు కళా రంగంలోనూ రాణించి గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. మే 31న రవీంద్ర భారతీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలలో జిల్లా నుండి 30 మంది బి. సి వసతి గృహ బాల బాలికలు పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నటరాజ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజలింగు, వసతి గృహ సంక్షేమాధికారులు సుజాత, సంధ్య, జావీద్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.