హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. బాలుర గురుకుల ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థి గొంతును తోటి విద్యార్థి కోశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దాడిలో విద్యార్థికి తీవ్ర రక్తమైంది. దీంతో అతడిని గచ్చిబౌలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈనెల 26న అల్పాహారం విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులకు సర్దిచెప్పి టీచర్ అక్కడి నుంచి పంపించింది. కక్షతో అర్ధరాత్రి సమయంలో విద్యార్థిపై మరో విద్యార్థి దాడి చేశాడు. ఘటనపై నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..