మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు గుడిపేటలోని 13వ బెటాలియన్ లో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను గురువారం కలెక్టర్ భారతీ హోలికెరీ, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ చేపట్టనున్న నేపథ్యంలో వివిధ ఉద్యోగాలకు సిద్దమవుతున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వమే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీతత్వంతో కష్టపడి ఉద్యోగం సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ నురేష్, సహాయ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్, తదితరులు పాల్గొన్నారు..