ఆంజనేయులు న్యూస్: రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశద్రోహ నేరాన్ని నేరంగా పరిగణించే ఐపీసీలోని సెక్షన్ 124ఏ లోని నిబంధనలను పునఃపరిశీలించడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. పునఃపరిశీలిన పూర్తయ్యే వరకు 124ఏ కింద ఎలాంటి కేసు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది..