Telugu Updates
Logo
Natyam ad

స్టేషన్ బెయిల్ కు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన సీఐ

బుక్కరాయ సముద్రం సీఐ రాము రూ.25 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అ.ని. శా) కు చిక్కారు.

ఆంజనేయులు న్యూస్, అనంతపురం జిల్లా: బుక్కరాయ సముద్రం సీఐ రాము రూ.25 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు చిక్కారు. విద్యా సంస్థల యజమాని నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కళాశాల యజమాని మల్లికార్జున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసేందుకు నిందితుడి నుంచి సీఐ రాము రూ.75 వేల లంచం డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా నిందితుడు సీఐకి తొలుత రూ. 50వేలు చెల్లించారు. మిగతా రూ. 25 వేల కోసం వేధిస్తుండటంతో.. ఆయన ఏసీబీకి సమాచారం ఇచ్చారు. ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ అధికారులు. శనివారం పక్కా నిఘాతో సీఐ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సీఐ రాముకు సహకరించిన మరో కానిస్టేబుల్ కరీంను కూడా అరెస్ట చేశారు. అనంతరం కర్నూలు ఏసీబీ కోర్టులో వారిని హాజరు పరిచారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన సీఐ రాము గతంలో గుత్తిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డిని ఆయన సమక్షంలోనే పొగడ్తలతో ముంచెత్తి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేని సింహంతో పోలుస్తూ రాము చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.