Telugu Updates
Logo
Natyam ad

జై శ్రీరామ్’ నినాదాలతో మారుమోగిన భద్రాద్రి

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల జయజయద్వానాల మధ్య మిథిలా మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అభిజిత్ లగ్నంలో అర్చకులు కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రారోడ్, తితిదే నుంచి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలను మంత్రులు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు అందజేశారు.