Telugu Updates
Logo
Natyam ad

ఏసీబీకి ప్రత్యేక యాప్: సీఎం జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), దిశ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. హోం శాఖపై జగన్ సమీక్ష నిర్వహించారు. హోం శాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అవినీతి జరుగుతున్న విభాగాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని.. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి ప్రత్యేక యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో యాప్ రూపకల్పన చేయాలన్నారు. అలాగే మండల స్థాయి వరకు ఏసీబీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతేకాకుండా ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉండాలని వెల్లడించారు.

నేర నిర్ధరణకు ఫోరెన్సిక్ విభాగం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాలను చోటు ఉండకూడదని.. దాన్ని కూకటివేళ్లతో సహా పెకలించాలన్నారు. డ్రగ్స్ విషయంలో విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలని.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి ప్రత్యేక కాల్ సెంటర్ నంబరు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.